ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
హైదరాబాద్
బోరబండలో పలు ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. ఏకంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్లు వివరాలను తీసుకొని ప్రతి ఒక్క ఓటరుకు వారి క్రమ సంఖ్య బూత్ నంబర్ వివరాలను ఒక భారతీయ జనతా పార్టీ కరపత్రంలో పొందుపరచి ఇంటింటికి వాటిని చేరేలా చేస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఏ పార్టీ నాయకులు ఓటర్ స్లిప్పులు కూడా పంచడం నేరమే అవుతుంది, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకంగా పార్టీ సింబల్ తోనే కరపత్రాన్ని తయారుచేసి అందులో ఓటరు వివరాలను నిక్షిప్తం చేసి ఓటర్లకు అందించడం తీవ్ర చర్చ నియాంశంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అధికులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -