కేసీఆర్ చిల్లర మాటలు మానుకోవాలి
హైదరాబాద్
పల్లెబాటలు పట్టిన కేసీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేసారు. కెసిఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన ఆయన తీరు మార్చుకోలేదు ఇంకా దురహంకారం తో వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా పథకాలు అందిస్తూ దానితో పాటు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. గతంలో నువ్వు ఏమి చేయలేకనే నీకు బుద్ధి చెబితే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల పొలాలకు వెళ్తున్నావని ప్రశ్నించారు. కాలేశ్వరం అని చెప్పి లక్షల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావని అన్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ మళ్ళీ రైతుల పొలాల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావని మండిపడ్డారు. గత సంవత్సరం వర్షాలు తక్కువ పడటం వల్లే భూగర్భ జలాల్లో నిరు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కరువు రాలేదని. వర్షాలు లేక ప్రాజెక్టులన్ని ఎండిపోయాయని తెలిపారు. రైతుల పొలాలు ఎండిపోవడం బాధాకరమే వారి గురించి మా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. గత ఎలక్షన్స్ లో నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయని పల్లెబాట పట్టావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోటే రైతుల సంక్షేమ సాధ్యమవుతుందని బీర్ల ఐలయ్య అన్నారు కెసిఆర్ చిల్లర మల్లార మాటలు బంద్ చేసి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను సంక్రమంగా వహించాలని అన్నారు.
కేసీఆర్ చిల్లర మాటలు మానుకోవాలి
- Advertisement -
- Advertisement -