తెలంగాణ హైకోర్టులో విషాదం..
వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో లాయర్ కన్నుమూత
హైదరాబాద్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)
Lawyer dies of heart attack while hearing arguments
: ఇటీవల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపులో వరుడు ఊరేగుతూ, ఇలా వేర్వేరు ఘటనల్లో పలువురు కుప్పకూలి మృతి చెందిన ఘటనలు వరుసగా జరిగాయి. సేమ్ టు సేమ్ అలాంటి ఘటన తెలంగాణలో మంగళవారం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఓ లాయర్.. సీరియస్ గా వాదనలు వినిపిస్తూ, తుదిశ్వాస విడిచారు. ఏకంగా న్యాయస్థానంలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
న్యాయవాది పసునూరి వేణుగోపాల్.. మంగళవారం రోజు వారీ మాదిరిగానే హైకోర్టుకు వచ్చారు. తన క్లయింట్ తరపున సీరియస్ గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలి తుది శ్వాస విడిచినట్లు సమాచారం. వాదనలు వినిపిస్తూ న్యాయవాది వేణుగోపాల్ కన్నుమూయగా, తోటి న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.