హనుమాన్ శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన సీనీ అనంద్
సికింద్రాబాద్..
Sini Anand inspects the route of Hanuman Shobha Yatra
వీర హనుమాన్ విజయ శోభాయాత్ర రహదారి మార్గాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హిందూ ధార్మిక సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. గౌలిగూడ నుండి తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయి వి.హెచ్.పి, బజరంగ్దళ్ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాడ్ బండ్ వద్ద శోభాయాత్ర పూర్తి కానున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు.గత సంవత్సరం జరిగిన లోటుపాట్లను సరి చేసుకుంటూ ఈ ఏడాది శోభయాత్ర విజయవంతం అయ్యేవిధంగా కృషి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.రహదారుల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం తో పాటు పలు అంశాలపై సూచనలు చేశామని పేర్కొన్నారు. సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ పరిధిలో 42 ర్యాలీలు శోభాయాత్రలో కలుస్తాయన్నారు.
సమయపాలన పాటిస్తూ శోభాయాత్రను విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
గౌలిగూడ నుండి మొదలయ్యే శోభాయాత్రకు దాదాపు 17వేల మందితో పాటు 3000 మంది పోలీసు అధికారులతో పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.నిర్వాహకులతో శోభాయాత్ర విషయంలో అన్ని విషయాలు చర్చించాము. ఈ ఏడాది ఘనంగా శోభయాత్ర విజయవంతం అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.