‘పుష్ప ది రూల్’ ..తగ్గేదేలే..జాతర సీక్వెన్స్ కోసం ₹50+ కోట్లు!
పాన్-ఇండియా చిత్రం “పుష్ప 2” టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్బంగా మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆశ్చర్యపరిచేలా చేసింది. టీజర్‌లో డైలాగ్‌లు లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ, గంగమ్మ జాతర సీక్వెన్స్ సీన్స్ కి మాత్రం విజిల్స్ కొడుతున్నారు.
ఇప్పుడు ఈ సినిమా కి సంబంధిచి ఒక ఇంటరెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అది గంగమ్మ జాతర సీక్వెన్స్ సీన్స్ కి రూ. 50కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ జాతర సన్నివేశాన్ని దాదాపు 30+ రోజుల పాటు అల్లు స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ చేసారు. ప్రత్యేక అలంకరణ, లైటింగ్ సెటప్‌లు, ఆర్ట్‌వర్క్, సన్నివేశాన్ని చక్కదిద్దడానికి ప్రత్యేక మోకోబోట్ కెమెరా, నిర్మాణానికే ₹ 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక స్టార్ నటీనటుల రెమ్యునరేషన్‌లు, ప్రీ-విజువలైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ వంటి పోస్ట్-ప్రొడక్షన్‌లతో కలిపి సుమారుగా మరో ₹20 కోట్లు. అందుకే ఈ జాతర సీక్వెన్స్‌కే దాదాపు ₹50+ కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫహద్, జగదీశ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.