ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

- Advertisement -

పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు
పరవాడ
వంగవీటి మోహనరంగా 77వ జయంతి సందర్భంగా గ్రేటర్ విశాఖ 79 వ వార్డు లంకెలపాలెం జంక్షన్లో పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన వంగవీటి మోహనరంగాను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదని, రాష్ట్రంలో ప్రతి ఏడాది ఏదో ఒక చోట ఆయన విగ్రహాలు ఆవిష్కరణ చేస్తూనే ఉన్నారన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వంగవీటి మోహన రంగా చిరస్మరణీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు కె. వాసుదేవరావు, బిజెపి నాయకుడు బంతికోరు గోవిందరాజు,రాఘవా పురపు శ్రీనివాస్ కుమార్, గొల్లవిల్లి నానాజీ, సంపంగి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular