- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సీపీఐ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ మాట్లాడుతూ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చేపట్టనున్న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని కోరారు. అలాగే ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మహిళా సంఘం రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలని బోనకల్ మండల నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సమావేశంలో పార్టీ నాయకులు, పాల్గొని కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
- Advertisement -




