Friday, February 27, 2026

తాకట్టులో బంగారం విడిపిస్తామంటూ మోసం

- Advertisement -

తాకట్టులో బంగారం విడిపిస్తామంటూ మోసం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (వాయిస్ టుడే )

Fraudulently claiming to release gold in pledge
వివిధ అవసరాల నిమిత్తం కొంతమంది బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. అయితే ఆ తర్వాత సరైన ఆదాయం లేకపోవడంతో ఈ రుణం పై వడ్డీ పెరుగుతుంది. ఈ సమయంలో బంగారం తీసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే కొందరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాం అంటూ ఇటీవల ప్రకటనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనలు పోస్టర్ల రూపంలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొందరు వీటికి అట్రాక్ట్ అయి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తా అంటూ వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలుసుకొని వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొల్లగొడుతుంటారు. అసలు ఈ మోసం ఎలా ఉంటుందంటే?బంగారం పై రుణం లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారు.. దీని నుంచి విముక్తి పొందాలని కోరుతూ ఉంటారు. దీనిని అదును చేసుకున్న కొందరు తక్కువ వడ్డీకే కొత్తలోని ఇస్తాం అంటూ ప్రచారం చేస్తారు. అయితే ఒకవేళ ఈ ప్రకటనలకు స్పందిస్తే మోసం చేసేవారు ముందుగా తాకట్టు రసీదు, ఆధార్, ఫోటోలు పంపాలని కోరుతాడు. ఆ వివరాలు వచ్చిన తర్వాత నకిలీ ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆ తర్వాత లోన్ ఆఫర్ లెటర్లు పంపిస్తారు. కానీ చివరికి అదేమీ ఇవ్వకుండా మొహం చాటేసి కనిపించకుండా పోతారు.ప్రధానంగా ఇలాంటి వాటిలో నాలుగు రకాల మోసాలు ఉంటాయి. వీటిలో మొదటిది ముందస్తు ఫీజు బస్సులు చేయడం. బంగారం విడిపిస్తామని చెప్పిన వారు ప్రాసెసింగ్ ఫీజు పేరిట ముందస్తుగా డబ్బులు వసూలు చేస్తారు. ఇందులో ఇన్సూరెన్స్, స్టాంపు చార్జీలు అంటూ అదనంగా వసూలు చేస్తారు. రెండోది బంగారం తీసుకుని పారిపోవడం వంటివి కూడా ఉంటాయి. కొందరు గ్యాంగ్ గా ఏర్పడి ఫ్రీ ప్లాన్ తో రెడీగా ఉంటారు. ముందుగా వీరిలో ఒకరు బ్యాంకుకు వెళ్లి బంగారం తీసుకొస్తామంటూ వస్తారు. ఆ తర్వాత బాధితులతో అధికార పత్రం పై సైన్ చేయించుకుంటారు. బంగారం తీసుకున్న తర్వాత ఒక్కసారిగా అదృశ్యం అవుతారు.అలాగే తాకట్టులో ఉన్న ఫైనాన్స్ కంపెనీ తమకు బాగా పరిచయం ఉందని.. సెటిల్మెంట్ చేస్తామని బాధితులను నమ్మిస్తారు. ఇందులో భాగంగా బాధితులను తిప్పుకుంటూ వారి చేత ఖర్చులు చేయిస్తారు. చివరికి బంగారం మాత్రం తాకట్టు లోనే ఉంటుంది. చివరగా తాకట్టు పెట్టిన వారి సమాచారం సేకరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఇందులో ఆధార్, పాన్, తాకట్టుకు సంబంధించిన రసీదులను తీసుకొని మరోచోట లోన్ పొందుతారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా గ్రామీణ, పట్టణాల్లో కనిపిస్తాయి. అప్పుల బాధతో ఉన్నవారు వాటి నుంచి త్వరగా బయటపడేందుకు బాధితులు చెప్పే ప్రతి మాట వింటూ ఉంటారు. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్