నేడు చెన్నై వెళ్ల‌నున్న ఎమ్మెల్సీ క‌విత‌

- Advertisement -

నేడు చెన్నై వెళ్ల‌నున్న ఎమ్మెల్సీ క‌విత‌

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం చెన్నైలో పర్యటించనున్నారు.

ఏబీపీ (ABP) నెట్‌వ‌ర్క్‌ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్‌’లో MLC కవిత పాల్గొననున్నారు.

ఈ స‌మ్మిట్‌లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం రాత్రి ప్రారంభ‌మ‌య్యే చర్చా వేదికలో క‌విత పాల్గొని అభిప్రాయాలను తెలియజేయనున్నట్టు సమాచారం.

ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నమలై కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular