సెప్టెంబర్ 4 న మాంసం & బీఫ్ దుకాణాల మూసివేత
జీహెచ్ఎంసీ ఆదేశాలు
Meat and beef shops to remain closed on September 4.
హైదరాబాద్,
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 04 సెప్టెంబర్ 2026న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు మరియు పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం & బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు మరియు పశువుల కబేళాలు, మాంసం & బీఫ్ దుకాణాల మూసివేతను సమర్థవంతంగా అమలు చేయడంలో మున్సిపల్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరారు.



