Monday, December 23, 2024

కాంగ్రెస్ కి 10 ..  టీఆర్ఎస్ కి 11 ఎకరాలు … పేదలకు మాత్రం స్థలం ఉండదా?

- Advertisement -

ఇది లిక్కర్ తెలంగాణ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్: పాలమూరులో బీజేపీ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహా ర్యాలీ సందర్భంగా సభనుద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ జి. కిషన్ రెడ్డి మాట్లాడారు.  పాలమూరు మొదట్నుంచీ చైతన్యవంతమైన ప్రజా ఉద్యమాల వేదిక. తెలంగాణ ఉద్యమంలోనూ ఇక్కడినుంచి బీజేపీని గెలిపించడంతో.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడాల్సి వచ్చిందని అన్నారు.

దేశంలో మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇండ్లు కట్టించింది. తెలంగాణలో పేదప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఇండ్లు లేనటువంటి వారున్నారు. వారందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత మనదని మోదీ,  కేసీఆర్ కు  చెప్పారు. కానీ 9 ఏండ్లలో పేదల ప్రజల ఇండ్లు ముందుకు పడలేదు. ఆయన మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 10 ఎకరాలల్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో ఇండ్లు కట్టుకున్నడు. కాంగ్రెస్ పార్టీ భవనానికి 10 ఎకరాలు ఇచ్చిండ్రు.. టీఆర్ఎస్ పార్టీ భవనానికి 11 ఎకరాలు తీసుకున్నరు. కానీ పేదలకు ఇండ్లకు మాత్రం స్థలం ఉండదా? వాళ్లిద్దరు ఒక్కటే. పాలమూరు పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు స్థలం ఉండదా? ఇదే అన్యాయమని ప్రశ్నించారు.

అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు కట్టుకున్నరు. కానీ పేదలకు ఇండ్లు లేవు. పేదలకు ఎన్ని ఇండ్లు కట్టినా కేంద్రం ఆర్థిక సాయం చేస్తదని మోదీ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నిద్రనటిస్తోంది. అల్లుడెక్కడ పండుకోవాలె. ఆడబిడ్డ ఇంటికొస్తే కష్టం కాదా అని తుపాకీ రాముడి పాటలు చెప్పిండు. అలాంటి వ్యక్తిని అధికారంలో ఉంచాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ కు బుద్ధిచెప్పాల్సిన సమయం ఇది. వైఎస్సార్ హయాంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇంకా అమలువుతున్నాయి తప్ప. గత 9 ఏళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదు. ఇవ్వాలన్న సోయికూడా వారికి లేదు.

“పీఎం ఆవాజ్ యోజన” నిధులు ఏమయ్యాయి ?

కొత్త పింఛన్లు లేవు. వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం లేదు. ఎన్నికలు రాంగానే భారీగా హామీలు ఇస్తరు. కానీ వాటిని అమలు చేయరు. టీఆర్ఎస్ నాయకులను ప్రజలమీదికి వదిలి.. తమను ప్రశ్నించిన వారిమీద దాడిచేయిస్తున్నరు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేసి కాపలాకుక్కలాగా ఉంటా అన్నడు. అధికారంలోకి వచ్చినాంక.. దళితులకు వెన్నుపోటు పొడిచి.. సీఎం సీట్లో కూర్చున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది. ప్రతి ఇంటికో ఉద్యోగం అన్నడు. కానీ ఒక్క ఉద్యోగం రాలేదు. 9 ఏండ్లుగా డీఎస్సీ లేదు.  పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీలు అన్నిచోట్ల ఖాళీలే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్నడు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నడు. ఒక్కటి కూడా పూర్తిచేయలేదు. రైతు రుణాల మాఫీ అన్నడు. చిన్న, సన్నకారు రైతులు ఈయన్ను నమ్ముకుని బ్యాంకులకు అప్పులు కట్టలేదు. కానీ సర్కారు తీరుతో వాళ్లిప్పుడు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారని అన్నారు. కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చింది.  కరోనా సమయంలో పేదవాడిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికీ ఉచితంగా 5 కేజీల బియ్యాన్ని ఇచ్చారు. మోదీ ఇచ్చినా.. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం లేదు. పేదలు బాగుంటే ఆయనకు నచ్చదు. ఆయన బాగుండాలి. కుటుంబం బాగుండాలి.. చివరకు ఆయన పార్టీలోని నేతలు రోడ్లమీద ఆంబోతుల్లా తిరుగుతున్నరు కదా.. వాళ్లు బాగుండాలని మాత్రమే ఆలోచిస్తున్నారు.ఇవాళ తెలంగాణలో మద్యం దుకాణాలతోపాటు.. గల్లీకో బెల్టు షాపు మాత్రం ఉంటది. ఇదేనా బంగారు తెలంగాణనా? లిక్కర్ తెలంగాణ అని ఆరోపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్