Wednesday, January 22, 2025

10 లక్షల విజిటర్స్ వీసాలు..

- Advertisement -

10 లక్షల విజిటర్స్ వీసాలు..

10 lakh visitor visas..

ముంబై, డిసెంబర్ 28, (వాయిస్ టుడే)
రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను భారత్ పంపినట్టు పేర్కొంది. 2008/2009 తర్వాత ఈ స్థాయిలో విదేశీ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే మొదటిసారి.అంతేకాదు, వరుసగా రెండో ఏడాది అత్యధికంగా గ్రాడ్యుయేట్లను అమెరికాకు పంపిన ఘనతను కూడా భారత్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో రెండు లక్షల మంది (19 శాతం) భారతీయ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. విద్య తర్వాతి స్థానంలో పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం భారతీయులు తమ దేశాన్ని సందర్శిస్తున్నారని అమెరికా కాన్సులెట్ తెలిపింది. గత నాలుగేళ్లలో అమెరికాకు వెళ్లే భారతీయ పర్యటకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగి.. 20 లక్షలకు చేరిందని వెల్లడించింది. 2023లో 11 నెలలతో పోల్చితే.. ఈ ఏడాది అదే కాలానికి పెరుగుదల 26 శాతమని తెలిపింది.ఇప్పటికే అమెరికాలో భారత్‌కు చెందిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారుల 50 లక్షల మంది ఉన్నారని, రోజూ ఈ వీసాలను వేలల్లో జారీ చేస్తున్నామని పేర్కొంది. ఇదే సమయంలో హెచ్‌-1బీ వీసా పునరుద్దరణ పైలట్‌ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీసాదారులు తమ దేశానికి వెళ్లకుండా అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా ఈ విధానం తీసుకొచ్చారు. ఈ విధానంతో అత్యధికంగా అమెరికాకు ప్రత్యేక వృత్తి నిపుణులను అందిస్తున్న భారత్‌ ఎక్కువ లబ్ధి పొందనుంది.సాధారణంగా హెచ్‌-1బీ వీసాపై అమెరికా వెళ్లేవారు.. దాని గడువు ముగియగానే స్వదేశానికి వచ్చి స్టాంపింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త విధానం ప్రకారం.. ఇకపై అమెరికాలోనే వీసాలను రెన్యువల్‌ చేయించుకునే వెసులుబాటు కలగనుంది.‘‘భారతీయులకు 10 వలస వీసాలను జారీ చేశాం.. ఇది చట్టబద్ధమైన, నైపుణ్యం కలిగిన నిపుణుల వలసలను సులభతరం చేసింది… ఈ వీసాదారులు అమెరికాలో శాశ్వత నివాసితులు అయ్యారు.. ఇప్పటికే మా దేశంలో గణనీయంగా ఉన్న ప్రవాస భారతీయులకు వీరు అదనం’ అని ఆ ప్రకటన పేర్కొంది. గణాంకాల ప్రకారం.. 24,000 పాస్‌పోర్ట్‌లు, ఇతర కాన్సులర్ సేవలను అందించింది. స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ (STEP)లో మార్పుల వలన ఎంబసీ, కాన్సులేట్‌లను అమెరికా పౌరులను అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడం, వారికి భద్రతకు హెచ్చరికలను పంపడం సులభతరం చేస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్