10 తులాల బంగారు ఆభరణాలు అప్పగింత..!
చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న మేడిపల్లి పోలీసులు.
10 Tula gold ornaments handed over..!
వాయిస్ టుడే న్యూస్, మే 14 మేడిపల్లి : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం తన భర్తతో తన స్కూటీ పైన వెళ్తున్న సమయం లో సుమారు పంచవటి కాలనీ దగ్గరికి రాగానే తన బైక్ పై నుండి వారి యొక్క బాగ్ క్రింద పడిపోయినది కొద్దీ దూరం వెళ్ళాక బ్యాగ్ చూసుకునే సరికి బ్యాగ్ కనిపించలేదు, అట్టి బ్యాగ్ లో బట్టలతో పాటుగా 10 తులలా బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి, వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీస్ వారు సీసీటీవీ కెమెరాల ద్వారా చూడగా ఒక ప్యాసెంజర్ ఆటో అతను బ్యాగ్ ను తీసుకెళ్తున్నట్లు కన్పించింది. వెంటనే అట్టి ఆటోను వెతికి పట్టుకోని అందులో బట్టలు మరియు 10 తులలా గోల్డ్ ఆభరణాలు కన్పించాయి. తరువాత వాటిని పిర్యాదు అయ్యిన బాధితులకు అప్పగించడం జరిగింది.



