Sunday, September 8, 2024

 100 పదవులు..1000 మంది ఆశావహులు

- Advertisement -

 100 పదవులు..1000 మంది ఆశావహులు
హైదరాబాద్, జనవరి 2,
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే నామినేటెట్ పోస్టులు భర్తీ చేస్తారన్న సమాచారంతో నేతల మధ్య పలు పోస్టుల కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. గతంలో టికెట్ త్యాగాలు చేసిన వారు, పార్టీ కోసం కుటుంబాన్ని వదిలి పనిచేసిన వారు నామినేటెడ్ పోస్ట్ ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతంలో వారికి హామీ ఇవ్వడంతో .. ప్రస్తుతం ఆ పోస్టుల భర్తీ ఎప్పుడుంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎన్నికల సమయంలో చాలామంది నేతలు టికెట్ ఆశించారు.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియర్ నేతలకు సైతం టికెట్లు రాలేదు. ఏ ఒక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కి కూడా టికెట్ కేటాయించలేదు. దాదాపు 1,000 కి పైగా నేతలు టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్న… ముఖ్య నేతలకు కూడా టికెట్ రాకపోవడంతో గతంలో వారికి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో అందరి దృష్టి నామినేటెడ్ పోస్టులపైనే పడింది. నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.. మరోవైపు గతంలో ఎంపీలుగా పని చేసిన వారు ఇతర ముఖ్యనేతలంతా ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవుల్లో ఉన్నారు. కావున చాలావరకు ముఖ్యనేతలకు వచ్చే లోకసభ ఎన్నికలకు కొత్తవారికి అవకాశం రానుంది. మరోవైపు ఎమ్మెల్సీలుగా కూడా చాలామందికి అవకాశం రాబోతుంది. వీటితోపాటు దాదాపు 100 మందికి పైగా నేతలు కార్పొరేషన్ చైర్మన్ ల కోసం ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. అయితే కొత్త రిక్రూట్‌మెంట్లు త్వరలోనే ఉండబోతున్నాయని వార్తలు వస్తుండటంతో చాలామంది నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. ముఖ్య కార్పొరేషన్లైన ఆగ్రో ఇండస్ట్రీస్, రైతుబంధు సమితి, మార్క్ఫెడ్, కోఆపరేటివ్ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ, డైరీ డెవలప్మెంట్, సివిల్ సప్లై కార్పొరేషన్, మీడియా అకాడమీ, పవర్, టెక్స్టైల్స్, వర్క్ బోర్డ్ , బేవరేజస్ కార్పొరేషన్ తదితర కీలక నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ లో కీలక నేతలుగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబిసి సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మైనార్టీ సెల్ చైర్మన్ తో పాటు వివిధ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇలా దాదాపు 100 మందికి పైగా నేతలు సైతం కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశిస్తున్నారు.నామినేటెడ్ పదవులు ఆశించినటువంటి నేతలు చాలావరకు గత ఎన్నికల్లో కష్టపడిన వారే.. అయితే, మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కష్టపడి పనిచేసిన వారి పర్ఫామెన్స్ ఆధారంగానే పోస్టుల భర్తీ ఉండనుందని సమాచారం.. అయితే, అక్కడి సమాజిక పరిస్థితుల ఆధారంగా.. పార్లమెంటు ఎన్నికల తర్వాత.. లేదా.. ముందుగానే కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరుగుతుందని.. గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్