- Advertisement -
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి లకు వినతి
జగిత్యాల: ఐదు సంవత్సరాలు ప్రజా సేవలో ఉండి గ్రామాలాభివృద్దె ధ్యేయంగా పనిచేసి ఆర్థికంగా నష్టపోయిన మాజీ సర్పంచులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య, జగిత్యాల జిల్లా అధ్యక్షులు మచ్చ నారాయణలు కోరారు. జగిత్యాలలో జిల్లా అధ్యక్షులు మచ్చ నారాయణతో కలిసి
దేవయ్య బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ లకు 10 వేల పెన్షన్, పేదలయిన వారికీ, మాజీ సర్పంచ్డ మృతి చెందితే ప్రభుత్వ లాంచనలతో అంత్యక్రియలు జరిపించాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్, హెల్త్ కార్డులు, ప్రమాద భీమా, బస్సు పాసులు, ప్రతి జిల్లాకేంద్రంలో భవనం లాంటివి నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ సర్పంచ్ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరవధిక దీక్షలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మాజీ సర్పంచ్ లము వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి సమస్యలు విన్నవించామని తెలిపారు.
రాష్టంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన మాజీ సర్పంచులతో కలిసి టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి లను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని దేవయ్య, నారాయణలు తెలిపారు. సమావేశంలో విద్యాసాగర్ రావు, గంగాధర్, లక్ష్మణ్, గంగయ్య ,జలపతి, నర్సయ్య, రాజా గంగారాం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -