పురిటి నొప్పులతో 108 వాహనంలో ప్రసవం
ఖమ్మం, నవంబర్ 12 (వాయిస్ టు డే )
ఆల్లపల్లి మండల పరిధిలోని గర్భిణీ స్త్రీ నొప్పులు రావడంతో 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రసవం అయిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని బండారుగూడెం గ్రామానికి చెందిన నక్క సుమలత అనే నిండు గర్భిణీకి నొప్పులు తీవ్ర కావడంతో భర్త రమేష్ 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పైలట్ శ్రీహర్ష దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి తెరిచి ఉండకపోవడంతో వెంటనే వచ్చి 108 వాహనంలో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలు దేరాడు. నొప్పులు తీవ్ర తరం కావడంతో సిద్దారం గ్రమ సమీపంలో మార్గమధ్యలోని అడవిలో రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపి ఈ.ఎం.టి పి.భాగ్యమ్మ ఈఆర్ సీపీ డాక్టర్ శ్రీకాంత్ సహజ కాన్పుకు ఇచ్చిన సూచనలతో పండంటి బిడ్డను జన్మనిచ్చేలా చేసింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో తదుపరి చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలోనే తీసుకెళ్లారు. సకాలంలో 108 సిబ్బంది సహజ కాన్పుకు సహకరించినందుకు సుమలత భర్త రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
పురిటి నొప్పులతో 108 వాహనంలో ప్రసవం
- Advertisement -
- Advertisement -



