19,200 కోట్లతో బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే..

- Advertisement -

19,200 కోట్లతో బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే..

ఈరోజు మధ్యాహ్నం 12 గం.కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడి జీ..

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే బెంగళూరు విజయవాడ మద్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గిపోతుంది. ఇది ఇప్పుడు 12 గం.ల సమయం పడుతున్నది..

బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అనేది భారత్‌మాలా ప్రాజెక్ట్ 19,200 కోట్ల బడ్జెట్‌‌తో కేంద్రం ఆమోదించింది. ఈ బెంగుళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణమునకు ప్రధాన ఎజెండా రెండు నగరాల మధ్య మొత్తం ప్రయాణ సమయాన్ని తగ్గించడం..

బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్యాంశాలు..

1. బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటలు తగ్గిస్తుంది..

2. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబదుతుంది..

3. బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేను భారతమాల పరియోజన కింద అభివృద్ధి చేసి 6-లేన్‌ల ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దనున్నారు. ప్రాజెక్ట్‌లో 65% గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంగా మరియు మిగిలిన 35% బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతంగా అభివృద్ధి చేయబడుతుంది..

3. గంటకు 125-150 కి.మీ వేగంతో వెళ్లేలా కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు..

4. ఈ ప్రాజెక్ట్ కడప పట్టణం గుండా వెళుతుంది మరియు దీనిని BKV ఎక్స్‌ప్రెస్ వే అని కూడా పిలుస్తారు..

5. కొడికొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరిపేట మరియు గుంటూరు మరియు విజయవాడ వంటి పట్టణాలు మరియు గ్రామాలను ఈ ఎక్స్‌ప్రెస్ వే కలుపుతుంది..

ప్రస్తుతం, బెంగళూరు మరియు విజయవాడ మధ్య పలమనేరు , చిత్తూరు, తిరుపతి, గూడూరు, నెల్లూరు మార్గాన్ని కవర్ చేయడానికి మొత్తం సమయం 12 గంటలు. అయితే, కొత్త ఎక్స్‌ప్రెస్‌వేతో సమయం 50% తగ్గుతుంది. ఇప్పుడు, మొత్తం మార్గాన్ని కవర్ చేయడానికి కేవలం ఆరు గంటలు పడుతుంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular