కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు తెలంగాణలోని ప్రతి ఇంటికి అందేలా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు ఆకర్షితులై బీఆర్ఎస్ 200 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బారాస పార్టీ ప్రజా, ఉద్యోగ వ్యతిరేక పాలనకు విసిగి పోయామని నాయకులు చెప్పారు.శుక్రవారం జగిత్యాల ఇందిరాభవన్ పెగడపల్లి మండలం నార్సింహునిపెట గ్రామానికి చెందిన బారాస నాయకులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో మాజీ ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద ఎత్తున నాయకులు ,యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా జీవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెసు అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని జీవన్ రెడ్డి వారికి సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో మాజీ సర్పంచులు కొత్త లచ్చయ్య, ఎడవెల్లి లక్ష్మారెడ్డి, ఎడవెల్లి అరుణ, మాజీ ఉప సర్పంచ్ గుంటుకు లింగయ్య, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ నలువాల మల్లారెడ్డి, వార్డు సభ్యులుకొల కమల లచ్చయ్య, చంద్రారెడ్డి, కొత్త మధుకర్, సంజీవ్, కొండాల్ రెడ్డి, రాజిరెడ్డి, హన్మాండ్లు, వీరారెడ్డి, ప్రభాకర్, బుచ్చయ్య, జీవన్ రెడ్డి, వినోద్, తిరుపతి రెడ్డి, మహేష్, సురేష్, రాకేష్, రవి, నారాయణ, రాజయ్య, పాపిరెడ్డి తదితరులు చేరగా బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, మాజీ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి,మల్లారెడ్డి , రాములు గౌడ్, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.