Thursday, April 3, 2025

హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20,000 జరిమానా… అదేశాలు ఇంకా రాలేదు

- Advertisement -
20,000 fine for driving while wearing a headset... But it hasn't arrived yet
20,000 fine for driving while wearing a headset… But it hasn’t arrived yet

డ్రైవింగ్‌ చేస్తూ ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుంటే 20 వేల జరిమానా?

విజయవాడ, జూలై 26, (వాయిస్ టుడే): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొత్త ఆర్టీవో రూల్స్ తీసుకొస్తుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్‌ చూస్తూనో మాట్లాడుతూనో జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అయ్యాయని అందుకే ఏపీ ప్రభుత్వం వీటి నివారణపై దృష్టి పెట్టిందని అంటున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కొందరు డ్రైవింగ్ చేస్తుంటారు. మరికొందరు ఎవరికీ కనిపించకుండా బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు హెడ్‌సెట్‌ పెట్టుకొని జాయిగా వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఓ నిర్ణయం తీసుకుందని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారుతోంది.డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధించబోతోందని ఆ వార్త సారాంశం. ఆగస్టు నెల నుంచి ఇది ప్రారంభం కానుందని కూడా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20,000 జరిమానా వేస్తారని పుకార్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే రవాణా శాఖ అధికారులు వెల్లడించబోతున్నట్టు కూడా చెబుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కంటెంట్‌పై నిజనిర్దారణ కోసం ఏబీపీ దేశం ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే రవాణా శాఖాధికారులు తమకు అలాంటి అదేశాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని కూడా చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్