Sunday, September 8, 2024

వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు

- Advertisement -

2,64,000 crore loans to agriculture sector :

వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు
గృహ నిర్మాణానికి రూ.11500 కోట్లు రుణాలు
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో నిర్ణయాలు
విజయవాడ
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ  సమావేశం జరిగింది.  2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేసారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేసారు. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపోందించారు. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యం. అంటే గతం కంటే 14 శాతం అధికంగా రుణాలు. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రాణాళిక, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.323000 కోట్లు పెట్టుకోగా…ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.375,000 కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యం. గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల లక్ష్యంగా ఎంచుకున్నారు.
వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.231000 కోట్లు రుణ లక్ష్యం గాపెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.208136 కోట్ల రుణాలు మంజూరు.  ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహద పడే MSME రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యం. అంటే 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని ప్రణాళిక.  అలాగే గృహ నిర్మాణానికి రూ.11500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక.  సాంప్రదాయేత ఇంథన సెక్టార్ కు రూ. 8000 కోట్లు రుణ ప్రాణాళిక సిద్దం. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. .వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం,. పి 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం,  .డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, స్కిల్ డవల్మెంట్ కు చర్యలు తీసుకోవడం,  సంపద సృష్టించే, జిఎస్ డిపి పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడంపై  మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 4వ సారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్.ఎల్.బీ.సీ సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. ఈసమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్