Sunday, September 8, 2024

మధిరలో 26 వ జాతీయస్థాయి బాలోత్సవ్

- Advertisement -

మధిరలో 26 వ జాతీయస్థాయి బాలోత్సవ్– 23
మధిర లో జరుగుతున్న 26వ జాతీయస్థాయి బాలోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని
విద్యార్థుల్లో ఉన్న కళ
ప్రతిభను వెలికి తీయడం అభినందనీయం

-బాలోత్సవ్ -23 ని ప్రారంభించిన నందిని విక్రమార్క
రెండు రోజులపాటు కొనసాగనున్న పోటీలు
కళలకు కళాకారులకు నెలువుగా ఉన్న మధిర ప్రాంతంలో వాటిని పునర్జీవింప చేసే విధంగా విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికి తీసేందుకు రామభక్త సీతయ్య కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న బాలోత్సవ్ – 23 ని ఆమె ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాకారులకు పుట్టినిల్లుగా ఉన్న మధిర ప్రాంతంలో భావితరాలకు రంగస్థలం కలను సాంప్రదాయ ముత్యాలను మన సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా అందించే దిశగా నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడి తో వారిలో ఉన్న కళా ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఈ బాలోత్సవ్ లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆమె అభినందించారు.
నేడు,రేపు బాలోత్సవాలు:
రామభక్త సీతయ్య కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు 26వ” జాతీయ స్థాయి మధిర బాలోత్సవ్- 2023″ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, బాబ్లా, తెలిపారు.
తెలంగాణ ప్రాంతం నుండి, వరంగల్ ,భద్రాచలం, పాల్వంచ ,కొత్తగూడెం ,సత్తుపల్లి, ఖమ్మం ,ఎరుపాలెం ,మధిర, బోనకల్ మండలాల నుంచి, మరియు ఆంధ్ర ప్రాంతం నుండి జగ్గయ్యపేట ,నందిగామ తిరువూరు, గంపలగూడెం నుండి పోటీలకు దరఖాస్తులు చేసుకున్నారనీ వారు పేర్కొన్నారు. 13వ తేదీ సోమవారం ఉ. 10 గం.లకు శాస్త్రీయ నృత్యాలు,(60) ఒక స్టేజి పైన మరియు జానపద నృత్యాలు(50), గ్రూప్ డాన్సుల(25), రెండవ స్టేజి పైన నిర్వహించబోతున్నామని తెలిపారు .అదే రోజు సాయంత్రం బహుమతి ప్రధానం ఉంటుందనీ, .14వ తేదీ మంగళవారం ఉ. 10 గం.లకు ,నీ సత్తా చాటుకో,(35) నీతి పద్యాలు,(35) ఏకపాత్రలు(30), సాయంత్రం 6 గంటలకు విచిత్ర వేషాల (40)పోటీలు ఉంటాయనీ పేర్కొన్నారు .అనంతరం బహుమతి ప్రధానం ఉంటుందన్నారు . విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికి తీసే దిశగా కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను పెద్ద ఎత్తున కళాభిమానులు ప్రజలు తిలకించి విద్యార్థులను ఆశీర్వదించాలని వారు కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్