వచ్చే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
30 thousand jobs in three months
హైదరాబాద్:జులై 26
తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ ఈరోజు హాజరైయ్యారు.
కాగా ఫైర్‌మెన్ అభ్యర్థులు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన రేవంత్.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
యువత ఆకాంక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొలువుల కోసమే తెలం గాణ ఉద్యమం జరిగింద న్నారు.
బడ్జెట్‌లో విద్య, వ్యవసా యానికి అత్యంత ప్రాధా న్యం ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.
గడిచిన పదేళ్లలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 31 వేల మందికి నియామక పత్రాలిచ్చాం..
మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామ న్నారు. రేవంత్ రెడ్డి ఏ విప త్తు జరిగినా ముందుండేది ఫైర్ సిబ్బందేనన్నారు సీఎం రేవంత్.