- Advertisement -
జాతీయ అవార్డు అందుకున్న ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్
30-year village sarpanch who received national award
రాష్ట్రపతి చేతుల మీదగా డిల్లీ లో అవార్డు అందుకున్న సర్పంచ్…
ఉత్తమ గ్రామ పంచాయతీగా పురస్కారం
నందిగామ
దీన్ దయాల్ ఉపాధ్యాయ్పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకుఎంపికైన గ్రామ పంచాయతీలకు బుధవారం ఢిల్లీలో అవార్డులను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ పంచాయతీ (తాగునీటి సరఫరా, పచ్చదనం, పరిశుభ్రత విభాగం) ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ముప్పాళ్ళ పంచాయతీ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ కు బుధవారం నాడు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు.
- Advertisement -