రాజీనామా చేసిన వాడచీపురుపల్లి సచివాలయల 34 మంది వాలంటీర్స్
పరవాడ,
పరవాడ మండలంలో వాడాచీపురుపల్లి గ్రామ సచివాలయల 34 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. రాష్ట్రములో 57 నెలల నుండి తమకు కేటాయించిన ఇళ్ళలో సేవా దృక్పథంతో వాలంటీర్స్ గా సేవ చేయడం జరిగింది. గతంలో ప్రజలకు ప్రభుత్వం నుండి ఏమి పథకాలు వస్తున్నాయో కూడా తెలిసేది కాదు ,ఎవరికి అయినా తెలిస్తే వాటికి ఎలా ,ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలిసేది కాదు,తెలుసుకుని దరఖాస్తు చేసుకునే లోపు ఆఖరు తేదీ ఎప్పుడో అయిపోయింది అని చెప్పేవారు.ఈ విధంగా ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఉన్నా వారికి రేషన్ మినహాయించి ఏమి వచ్చేవి కావు,పెద్దపెద్దవి ప్రక్కన పెడితే , చిన్న చిన్నవి అయిన కొత్త రేషన్ కార్డు , పెన్షన్ , క్యాస్ట్ సర్టిఫికేట్ , ఇన్కమ్ సర్టిఫికెట్ , డెత్ సర్టిఫికెట్ , ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ , ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక పనులు మానుకొని ఆఫీస్ లు చుట్టూ తిరిగితిరిగి లంచాలు పెట్టినా సర్టిఫికేట్ లు రాక వదిలివేసిన వారు ఏoతమంది ఉన్నారో కూడా లెక్కలేదు.ఇలాంటి పరిస్థితుల్లో 2019 మే నెలలో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మొత్తం గమనించి నవరత్నాల పేరుతో ప్రజా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ,ఈ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం అర్హతే ప్రామాణికం గా అర్హత ఉన్నా ప్రతి ఇంటికి కులం , మతం,ప్రాంతం,పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ చొప్పున వాలంటీర్ వ్యవస్థను మరియు గ్రామ సచివాలయం,రైతు భరోసా కేంద్రం ,ఒక హాస్పిటల్, ఒక ప్రభుత్వ పాలకేంద్రం ప్రతి గ్రామానికి తీసుకుని రావడం జరిగింది,వాలంటీర్ ల ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వం కి ప్రజలకు మధ్య వారధి గా పనిచేస్తూ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం,మతం ప్రాంతం,పార్టీ చూడకుండా అందించడమేనని వాలంటీరి వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి రైతు భరోసా, పింఛను,అమ్మవడి ,ఇంటింటికి రేషన్ ,చేయూత ,ఆసరా,విద్యా దీవెన ,విద్యా కానుక,ప్రభుత్వ స్కూల్స్ మొత్తం ఇంగ్లీషు మీడియం , నాడు నేడు తో స్కూల్స్ మొత్తం రిపేరు,కొత్త రేషన్ కార్డ్ ,క్యాస్ట్ , ఇన్కమ్ , డెత్ , ఇతరత్రా సర్టిఫికెట్ లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రజలు ఎవరూ ఆఫీస్ ల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా ప్రతి పనీ దగ్గర ఉండి సీఎం జగన్ మోహన్ రెడ్డి తరుపున అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ఒక్క పైసా రాలేదు అనకుండా సేవలు అందించడం జరిగినది.అలాంటి వ్యవస్థ మీద కొంత మంది చాలా ప్రతిపక్ష పెద్దలు వాలంటీర్ లు మూటలు మోసేవారు,ఇంట్లో భర్త లేని టైం లో ఇంటి తలుపులు కొట్టే వారు,ఇళ్ళలోకి చొరబడేవారు ఇంకా ఈ విదమైన అనరాని అసభ్య మైన మాటలు అని వాలంటీర్ లని కించపరచడం జరిగింది.ఎన్నికల సమయం అవ్వడంతో ₹10000 జీతాలు ఇస్తాను అంటున్నారు.ఆ రోజు వాలంటీర్ లని తిట్టిన మీ వాలంటీర్ లని పొగుడుతూ ₹10000 జీతం ఇస్తాము అని వాలంటీర్ లని డబ్బుతో కొనాలి అని ప్రయత్నించి రెండు నాలుకుల ధోరణి అవలంబిస్తున్న ప్రతిపక్ష పెద్దల తీరుకు మాకు మనస్తాపం కలిగి.మా వాలంటీర్లు 34మంది రాజీనామా చేయడం జరిగింది అన్నారు.