బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే :కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఢిల్లీకి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు
చర్లపల్లి, ఆగస్టు 4 —————————
42 percent reservation for BCs must be implemented: Congress Seva Dal state president Middela Jitender
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు నగరంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో సేవాదళ్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం చర్లపల్లి రైల్వే స్టేషన్లో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ, “బీసీ వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కీలకం అని అన్నారు దేశంలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం దక్కడం లేదని మిద్దెల జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ జనాభా కనుగుణంగా , తగిన రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. గతంలో బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యలు ఆదర్శంగా నిలిచాయి. ఇప్పుడు తిరిగి అదే ఘనతను కొనసాగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోంది,” అని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి, ఏఐసీసీ అగ్ర నేత ప్రతిపక్ష నేత i రాహుల్ గాంధీ బీసీల పక్షాన ని లుస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలని, బీసీల దామాషా ప్రకారం వారికి న్యాయం జరగాలని కోరిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అగ్రకులానికి చెందిన వాడైనప్పటికీ, బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని మిద్దెల పేర్కొన్నారు. టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపై స్పందించేందుకు బలవంతం చేయడమే తమ ఢిల్లీ యాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు. “బీసీ వర్గాల ప్రాధాన్యతను అర్థం చేసుకుని దేశం మొత్తం న్యాయంగా పాలించాలంటే రిజర్వేషన్లు తప్పనిసరి. ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు, సమాజ అభివృద్ధికి అవసరం,” అని మిద్దెల జితేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ప్రతినిధులు వాజిద్ మైక్, బండి సురేందర్, సంపత్ కుమార్ గౌడ్, అబు బాకర్, ఫస్యుద్దీన్, సేవాదళ్ రాష్ట్ర ప్రతినిధులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్షులు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



