- Advertisement -
హోంగార్డు కుటుంబానికి ఐదు లక్షల చెక్కు అందచేత
5 lakh check to the Home Guard family— చెక్కును అందించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
పల్నాడు
ఇటీవల అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించారు.
తోటి సహోద్యోగల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డుకి ఒక్కరోజు వేతనం అందించిన హోంగార్డులకు పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు.
6వ బెటాలియన్ నందు విధులు నిర్వర్తిస్తూ హెచ్ జి 765 పి.శరత్ బాబు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఆరోగ్యం క్షీణించి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అందుకు గాను పి.శరత్ బాబు కుటుంబానికి హోమ్ గార్డులు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5 లక్షలు సాయం చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5 లక్షల చెక్కును జిల్లా ఎస్.పి కంచి శ్రీనివాసరావు చేతుల మీదుగా శరత్ బాబు భార్య పి.జాస్ని కి అందచేశారు. సాటి హోమ్ గార్డులకు సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా హోమ్ గార్డులను ఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు హోంగార్డు ఆర్.ఐ యస్.కృష్ణ పాల్గొన్నారు.
- Advertisement -




