Friday, April 4, 2025

50 మంది మావోలు లొంగుబాటు..

- Advertisement -

 50 మంది మావోలు లొంగుబాటు..
హైదరాబాద్, మార్చి 31, (వాయిస్ టుడే)

50 Maoists surrender..

ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన.. మరోవైపు 50 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ఈ రెండింటికి సంబంధం లేకపోయినా.. సమయం ఒకేసారి కావడంతో ఇప్పుడీ విషయం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారుల ముందు 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 14 మందిపై 68 లక్షల రివార్డులు కూడా ఉన్నాయి. దీంతో ఇది తమకు బిగ్ బ్రేక్ త్రూ అని పోలీసులు భావిస్తుండగా.. తమకు తగిలిన బిగ్‌ షాక్ అనుకుంటున్నారు మావోయిస్టులు.భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలే ఈ లొంగుబాటుకు కారణం అంటున్నారు ఉన్నతాధికారులు. ఈ మధ్య దండకారణ్యంలో ఎన్‌కౌంటర్లు పెరిగాయి. వరుసగా మావోయిస్టులు మరణిస్తున్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డు, బస్తర్ ఫైటర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, CRPF, కోబ్రా కమాండోలు ఇలా రకరకాల ఏజెన్సీలు ఇప్పుడు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వరుసగా మావోయిస్టులను మట్టుపెడుతున్నాయి. మరోవైపు నియా నెల్లనార్ పేరుతో గ్రామాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ప్రారంభించింది. ఇవి కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు ఉన్నతాధికారులు.చత్తీస్‌గఢ్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. రాష్ట్రంలో 33 వేల 700 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ఈ లొంగుబాట్లు జరిగాయి. మరోవైపు శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. ఇందులో 11 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాదిలో 134 మంది మావోయిస్టులను మట్టుపెట్టగా.. ఇందులో 118 మంది బస్తర్‌ డివిజన్‌లోని వారే. ఇక బస్తర్ రీజియన్‌లోనే ఈ ఏడాది ఏకంగా 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయిన ఘటన మరువక ముందే.. సుక్మా జిల్లాలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. గోగుండ కొండల ప్రాంతాంలో 15 మంది, ఉపంపల్లి ప్రాంతంలో ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలన్నది టార్గెట్‌. ఇందుకోసం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టారు. మాజీ మావోయిస్టులతో కలిసి డిస్ట్రిక్ రిజర్వ్డ్‌ గార్డ్స్ ఏర్పాటు చేశారు. వీరితో కలిసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు, జవాన్ల మధ్య తరుచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయ్‌. వారం క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్