దేవ్‌జీ తో సహా పోలీసుల అదుపులో ఉన్న50 మందిని కోర్టులో హాజరుపరచాలి
ప్రకటనను విడుదల చేసిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ
హైదరాబాద్ నవంబర్ 28
50 people in police custody, including Devji, should be produced in court
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారని ఆ లేఖలో పేర్కొంది. వారిని కోర్టులో హాజరుపరిచాలని డిమాండ్ చేసింది.డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి వికల్ప్ పేరిట గురువారం రిలీజైన ఈ ప్రకటన ఈ నెల 22వ తేదీతో ఉంది. ఇందులో నవంబర్ 18వ తేదీన జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్ గురించి అందులో ప్రస్తావించారు. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో హిడ్మా సహా ఆరుగురు మరణించారని పేర్కొన్నారు. ఈ నెల 19న అదే ప్రాంతంలో సురేశ్, శంకర్ సహా ఏడుగురిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 30వ తేదీన చత్తీస్‌గఢ్ దండకారణ్య బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.



