మధుయాష్కికి 50వేల మెజారిటీ ఖాయం: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంట శ్రవణ్ కుమార్
మధుయాష్కి గౌడ్ కు అంబేద్కర్ చిత్రపటం బహూకరణ
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంట శ్రవణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ను కలిసి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా గంట శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ ఇరిగి రమేష్, నాయకులు భీముడి రామకృష్ణ, సాయిగౌడ్, ధనుష్ నేత, వంశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.