Monday, February 23, 2026

 6 నెలల్లో 122 అవినీతి అధికారులు

- Advertisement -

 6 నెలల్లో 122 అవినీతి అధికారులు
హైదరాబాద్, జూన్ 25, ( వాయిస్ టుడే)

122 corrupt officials in 6 months

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారు. ఏసీబీ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అక్రమార్కులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. గత 6నెలల్లోనే 122కేసులు నమోదు చేసి, వందలా మందిని కటకటాలపాలు చేశారు ఏసీబీ అధికారులు. లంచగొండి అధికారులపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వరుస కేసులు, విచారణలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు.తెలంగాణలో ఏసీబీ అధికారులు గత ఏడాది 2024లో మొత్తం 129 ట్రాప్‌ కేసులు నమోదు చేస్తే, ఈ ఏడాది 6 నెలలు పూర్తికాక ముందే ఈ సంఖ్య 122కు చేరుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో సగటున ప్రతి 3 రోజులకు 2 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తున్న లంచావతారులు ఏమాత్రం జంకడం లేదు. గత కొన్ని రోజులుగా అక్రమార్కులు వరుసబెట్టి ఏసీబీకి పట్టుబడుతున్నారు. తెలంగాణ ఏసీబీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి.. అందుకే కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ఏసీబీ అధికారుల సత్వర స్పందనతో బాధితుల్లో సైతం నమ్మకం కుదురుతోంది. దీంతో బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి.అయితే ఏసీబీ అధికారుల అధికారిక టోల్‌ఫ్రీ నంబర్ 1064తోపాటు 94404 46106 వాట్సప్‌ నంబరు, ఫేస్‌బుక్, ఎక్స్‌ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది. ప్రజల్లో టెక్నాలజీ వినియోగం పెరగడం కూడా ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణంగా మారింది. సమాచారం రాగానే అధికారులు తొలుత అసలైనద కదా బాధితున్ని నిజంగానే లంచం డిమాండ్ చేశారా..! లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని నిర్ధారించుకుంటారు. ఎందుకంటే తమకు పడని అధికారులపైనా బాధితుల ముసుగులో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరోవైపు చాలా సందర్భాల్లో బాధితులే ఫోన్, వీడియో రికార్డింగులు వంటివి సమర్పిస్తున్నారు. కొంతమంది లంచావతారులైతే యూపీఐ ద్వారానే ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బాధితులు సమర్పించిన ఇలాంటి ఆధారాలను మరోమారు పునఃపరిశీలించిన తర్వాతే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఒక ఫిర్యాదును నిర్ధారించుకొని లంచం అడిగిన ఉద్యోగిని పట్టుకోవడానికి సగటున వారం నుంచి పది రోజులు పట్టేది. ఇప్పుడది మూడు నాలుగు రోజులకు తగ్గింది.ఏసీబీకి వచ్చే ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే స్పందించేందుకు ఏసీబీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో మరింత మంది సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
. ప్రతి పనికి ఓ రేటు
రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరుగుతూ అధికారులు పట్టుబడుతున్నా.. అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరి లంచం మా హక్కు అన్నట్లు మితిమీరి వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో తహసిల్దార్ అయితే వెయ్యి తక్కువ అయ్యాయని రైతును పీడించుకు తిన్నాడు. తహసీల్దార్ రాజారావు వసూళ్ల దందా, అంతా ఇంతా కాదు. తహాసిల్దార్ కార్యాలయం కేంద్రంగా లంచం డిమాండ్, తన ఛాంబర్ లో రైతు నుండి ఐదు వేలు లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. పాస్ బక్ లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ రాజారావు రైతు వద్దు ఐదు వేలు తీసుకుంటూ ఇంతేనా అంటు రైతుతో సంభాషణ, గుంటకు వెయ్యి చొప్పున ఇవ్వాల్సిందే అంటూ పట్టు బట్టాడు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో తన కార్యాలయమే కేంద్రంగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు తహాసిల్దార్ రాజారావు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అందాల్సిన సేవలకు లంచం డిమాండ్ చేస్తూ తమ అవినీతి దాహాన్ని తీర్చుకుంటున్నారు. కొందరు అధికారులు అందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు గ్రామానికి చెందిన రైతు పాస్ బుక్ లో పేరు మార్పు కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. అందుకుగాను గత కొన్ని రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే పేరు మార్చాలంటే పైసలు ఇవ్వాల్సిందే అంటూ తాసిల్దార్ రాజారావు డిమాండ్ చేయడంతో రైతు 5000 రూపాయలు తాసిల్దార్ కు లంచం ఇచ్చాడు.అయినా తృప్తి పడని తహసిల్దార్ రాజారావ్ ఇదేంటి ఐదు వేలేనా గుంటకు వెయ్యి చొప్పున ఇవ్వాల్సిందే ఇంకో వెయ్యి కూడా పంపించు అంటూ ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక రైతు సరే పంపిస్తా అంటూ రైతు కార్యాలయం నుండి వెళ్లిపోయాడు. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలకు మండల స్థాయి అధికారే లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు తన సెల్ఫోన్లో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేతులు పెట్టడం మాత్రం మానడం లేదు అనేందుకు అశ్వాపురం తహసిల్దార్ రాజారావు ఘటనే ఓ ఉదాహరణ. తహసీల్దార్ వసూళ్లు దందా పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే బదిలీ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్