- Advertisement -
ఐదు నెలల్లో 60 లక్షల మొక్కలు నాటారా ?
60 lakh saplings planted in five months?
అయ్యన్న పాత్రుడు
అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వన మహోత్సవం భాగంగా అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాక్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశానని ఆనాడు రెడ్ క్రాస్,ఎన్సీసీ c, గ్రీన్ క్రాప్ వంటి సంస్థల ద్వారా విద్యార్థులకు ఒకే రోజు 50 లక్షలు మొక్కలు నాటించామన్నారు.. అటవీ శాఖ ఈ ఐదు నెలల్లో 60 లక్షలు మొక్కలు నాటారని పేపర్ మీద తప్ప నిజానికి అవి జరగలేదని, దానిపై సోషల్ ఆడిట్ చేయించి విచారణ జరిపించాలని కలెక్టర్ని కోరారు, మొక్కలునాటినది నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో నాలుగు లక్షలు డ్వాక్రా మహిళల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం జరపవచ్చని తెలిపారు.. నర్సీపట్నం రేంజ్ లో పలు డిపోల్లో జరుగుతున్న అక్రమ కలప పై కొమ్ముకాస్తున్న కొంతమంది అధికారులపై పేర్లతో సహా సంబంధిత జిల్లా అటవీ శాఖ అధికారికి ఫోటోలు తో కంప్లైంట్ఇచ్చారని అయన అన్నారు…
- Advertisement -




