తెలంగాణలో భారీగా పుంజుకున్న బీజేపీ
8 అసెంబ్లీ నుంచి 8 పార్లమెంట్ దాకా
హైదరాబాద్, జూన్ 4
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చేలా ప్రస్తుత ట్రెండ్స్ కనిపిస్తోంది. అయితే తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీకు 8, కాంగ్రెస్ కు 8, ఎంఐఎంకు 1 సీటు రానున్నట్లు ఫలితాల సరళిని చూస్తే అర్థమవుతోంది. ఇక ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ అయితే ఖాతా తెరవలేదు. మెదక్ పార్లమెంట్ స్థానంలో రెండవ స్థానానికి పరిమితం అయింది. ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి అధికసీట్లు వస్తాయిని అంచనాలు విడుదల అయ్యాయి. కానీ వాటికి భిన్నంగా బీజేపీ, కాంగ్రెస్ కు చెరో 8 స్థానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ముందు వెనుకబడినప్పటికీ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మాధవీలతను వెనుకకు నెట్టి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.గతంలో కాంగ్రెస్ 12 నుంచి 14 స్థానాలు సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి ఆ దిశగా కనిపించడంలేదు. బీజేపీ అయితే గతంలో 4 సీట్లు సాధించింది. ఈసారి 8 సాధించే దిశగా అడుగులు వేస్తోందని చెప్పాలి. అంటే గతంలో కంటే ఓటు షేర్ తో పాటు సీట్లను కూడా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. రెండు జాతీయ పార్టీలకు సమానంగా సీట్లు వచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఎన్డీయే కూటమికి ఇండి కూటమి గట్టి పోటీని ఇస్తోంది.
8 అసెంబ్లీ నుంచి 8 పార్లమెంట్ దాకా
- Advertisement -
- Advertisement -