ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయ‌ణ‌పుర్‌లో ఇవాళ ఎన్‌కౌంట‌ర్
 ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతి
నారాయ‌ణ‌పుర్‌ జూన్ 15
8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. అబుజ్‌మాడ్ అడ‌వుల్లో ఇవాళ ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్ర‌తా ద‌ళాలు యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్న స‌మ‌యంలో ఎదురుకాల్పులు జ‌రిగిన‌ట్లు రాయ్‌పూర్ సీనియ‌ర్ పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు.ఇంకా అక్క‌డ ఫైరింగ్ న‌డుస్తున్న‌ట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్ గార్డ్‌, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌, 53 బెటాలియ‌న్ ఐటీబీపీకి చెందిన ద‌ళాలు జూన్ 12వ తేదీన కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి. ఎన్‌కౌంట‌ర్‌కు చెందిన మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది.
=================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular