
తమిళనాడు : తమిళనాడులో బాణాసంచా గోడౌన్ భారీ పేలుడు చోటు చేసుకుంది. కృష్ణగిరి పాతపేటలోని ఓ గోడౌన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి సమీపంలోని ఐదు ఇల్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీపేలుడు ధాటికి శరీరాలు చెల్లాచెదురయ్యాయి. ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ టెండర్లు, రెస్క్యూ టీమ్‌లు మంటలను ఆర్పివేసి లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు ధాటికి హౌటల్ భవనం పూర్తిగా కూలిపోయిందని, సమీపంలోని మూడు-నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్యను రెస్క్యూ సిబ్బంది ఇంకా గుర్తించలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.