తొమ్మిది ఏళ్లలో 9వేల కోట్లతో అభివృద్ది

- Advertisement -
9 thousand crores development in nine years
9 thousand crores development in nine years

శేరిలింగంపల్లి: తొమ్మిది ఏళ్లలో 9వేల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినట్టు శేరిలింగంపల్లి టిఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి తోపాటు కార్యకర్తలతో కలిసి శివాజీ నగర్ కాలనీ,  తార నగర్, సిటీజన్ కాలనీ, వెంకటేశ్వర్ నగర్, ఇందిరా నగర్, తదితరు కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 90 శాతం పనులు పూర్తి చేసామని మిగిలిన పనులను కూడా ఎన్నికల అనంతరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కాలనీ చుట్టూ చెరువులు ఉండటం వల్ల వర్షాకాలంలో కాలనీలు నీటములకి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే వారిని సమస్యలను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కారం చేసినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ మేనిఫెస్టో కుటుంబాని 15 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం నిరుపేద కుటుంబాలకు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టో ప్రకటించినవి కాకుండా మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గాంధీ వివరించారు. జరిగిన అభివృద్ధిని చూసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పడం ఆనందంగా ఉందని గాంధీ అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular