Sunday, May 24, 2026

బరిలో 90 శాతం మంది కోటీశ్వరులే…

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 1, (వాయిస్ టుడే ):  తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలలో 90 శాతం అంటే 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ADR) సంస్థ వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో అయిదు మంది, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి అత్యధికంగా రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా సంస్థ పేర్కొంది.అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో రూ.161 కోట్లతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రూ.91 కోట్లతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆస్తుల వివరాలకు వస్తే రూ.41 కోట్ల ఆస్తులు ఉండగా రూ.27 కోట్ల అప్పు ఉంది.

సీఎం కేసీఆర్ కు రూ.23 కోట్ల ఆస్తి ఉండగా రూ.8 కోట్ల అప్పు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆస్తుల వివరాలకు వస్తే ఆయనకు రూ.56 కోట్లు ఆస్తి ఉండగా రూ.8 కోట్ల అప్పు ఉంది.ఇక యాకుత్పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలోనే తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని తర్వాత ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రవిశంకర్ సుంకే (చొప్పదండి) కేవలం రూ.20 లక్షలతో, ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) దాదాపు రూ.27 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.లయబిలిటీస్ లో రూ. కోటికి పైగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టాప్ లో ఉన్నారు. తర్వాతి స్థానంలో రూ.63 కోట్లతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్ ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ సంస్థ వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్