- Advertisement -
పేదలకు ఇండ్లు అందించేవరకు పోరాటం కొనసాగుతుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: మహబూబ్ నగర్ లో జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ బయలుదేరారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదల కల.. డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు అందించే వరకు మా పోరాటం సాగుతుంది . రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసింది. కేంద్రం ‘పీఎం ఆవాజ్ యోజన’ కింద ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు. ఇండ్లు కట్టరు.. కట్టిన వాటిని అర్హులకు పంచరు. కట్టిన ఇండ్లు పాడవుతున్నా పేదలకు ఇవ్వకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డికి శంషాబాద్ లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
- Advertisement -