Saturday, February 14, 2026

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

- Advertisement -
life-imprisonment-for-two-accused-in-the-murder-case
The High Court verdict sentencing the accused to life imprisonment.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం,ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు ఈ రోజు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీ పాటిల్ వసంత్ గారు జీవిత ఖైదుతో పాటు 1000/- రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించారు.

నిందితులపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో Cr.no 165/22,U/s 302,353,332 r/w 34 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకమైన ఈ కేసులోని నిందితులు మడకం తులా మరియు పోడియం నంగా లను పోలీసులు వెంటనే అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగింది.

హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు,సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ అన్నారు.నేరం చేసిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడుతుందని తెలియజేసారు.

నిందితులకు ఇద్దరికీ శిక్ష పడేవిధంగా కృషిచేసిన విచారణాధికారి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణ,కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రవి,లైజన్ ఆఫీసర్ వీరబాబు లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి,సత్కరించారు.

నిందితులకు జీవిత ఖైదు హైకోర్టు తీర్పు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్