మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి పై వినోద్ హాట్ కామెంట్
కరీంనగర్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈసారి రసమయి బాలకిషన్ కి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. మంగళవారం వినోద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో రూ. 71 కోట్లతో.. గుండ్లపల్లి నుండి పొత్తూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి వినోద్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ టికెట్ విషయంలో తుది నిర్ణయం కేసీఆర్ దేనని .. తాను కేసీఆర్ దగ్గరికి తీసుకపోవడమే తప్ప ఎవరికి ఏ పదవి ఇవ్వాలో తమకు తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటారంటూ..మరో వైపు గతంలో మానకొండూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరెపల్లి మోహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ చేరారు. ఆ సమయంలో ఆరెపల్లికి మంచి గౌరవ ప్రధనమైన స్థానం కల్పిస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారంటూ మరో బాంబు పేల్చారు. గన్నేరువరం జడ్పిటిసి రవీందర్ రెడ్డి రసమయి బాలకిషన్ ను మానకొండూర్ అభ్యర్థిగా ప్రకటించాలని వినోద్ కుమార్ ను కోరడంతో.. ఆయన పై విధంగా స్పందించారు. దీంతో ఈసారి రసమయికి టికెట్ డౌటే అంటూ.. ఆరెపల్లి మోహన్ కే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గా స్పష్టంగా కనిపిస్తోంది.