
వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య
వరంగల్ క్రైం బ్యూరో, ఆగస్టు ( వాయిస్ టుడే ప్రతినిధి): హరితహారం లో భాగంగా జిల్లా లో నాటిన మొక్కల వల్ల నేడు ప్రతీ గ్రామం పచ్చదనంతో కనపడుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
క్షేత్ర స్థాయి పర్యటన లో భాగంగా బుధవారం కలెక్టర్ పి. ప్రావీణ్య, సంగెం మండలములోని తీగరాజుపల్లి , గాంధీనగర్, తిమ్మాపూర్ గ్రామాలలో దశాబ్ది వన సంపద, బృహత్ పల్లె ప్రకృతి వనం లను పరిశీలించారు. తిమ్మాపూర్ లోని బృహత్ పల్లె ప్రకృతి వనం లో చెట్లను చూసి కలెక్టర్ బాగున్నాయని అభినందించారు.
గాంధీనగర్ లో ని దశాబ్ది వన సంపద లో కూడా నాటిన మొక్కల ను చూసి బాగుందని చెప్పి.. ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తూ సంరక్షించాలని తెలిపారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్బంగా చేయాలిసిన ప్లాంటేషన్ కోసం సంగెం మండలంలోని తీగరాజుపల్లి లో స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. గీసుగొండ మండలం కొనాయిమాకుల లో ఇరిగేషన్ ల్యాండ్ లో కలెక్టర్ మొక్కను నాటడం జరిగింది. ఎస్సారెస్పీ కెనాల్ బండ్ మొత్తం విస్తీర్ణం లో లీనియర్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. గీసుగొండ మండలం వంచనగిరి సోషల్ వెల్ఫేర్ ఇళ్ల పట్టాల కు సంబందించిన స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమం లో డి.ఆర్.డి.ఎ. పి. డి., ఎంపీడీఓ లు, తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.



