Saturday, December 21, 2024

23న చంద్రుడి పై దిగనున్న ల్యాండర్ మాడ్యూల్

- Advertisement -

చంద్రుడి  చుట్టూ తిరగనున్న చంద్రయాన్

the-lander-module-will-land-on-the-moon-on-the-23rd
the-lander-module-will-land-on-the-moon-on-the-23rd

నెల్లూరు, ఆగస్టు 16 : ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఇవాళ మరోసారి ఫైరింగ్ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్-3 ను 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే చంద్రయాన్-3 అనే సినిమాకు ఇవాళ పూర్తి చేసుకున్న ఘట్టం ప్రీ-క్లైమాక్స్. ఇక క్లైమాక్స్ కు రంగం సిద్ధమైంది. అదేంటంటే రేపు అంటే ఆగస్ట్ 17వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరు పడుతుందన్నమాట. ఇలా సెపరేట్ అయిన ల్యాండర్ మాడ్యూల్ ఆగస్ట్ 23వ తేదీన స్మూత్ గా ల్యాండ్ అయితే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినట్టు అన్నమాట. ఇవాళ చంద్రయాన్-3 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం చేరేదాకా ప్రయాణించి అక్కడి నుంచి ల్యాండర్ జంప్ చేస్తుందన్నమాట. మన ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్ట్ 23వ తేదీన అది ల్యాండ్ అవుతుంది. అంటే సరిగ్గా ఇంకో వారమే ఉందన్నమాట.. ప్రయోగం విజయవంతమో కాదో తేలడానికి.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ అంతరిక్ష నౌక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవనుంది. ఇప్పటికే అంతరిక్ష నౌక ఇటీవల చంద్రుడి దూరంలో మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ ల్యాండింగ్ అయితే చరిత్ర సృష్టించినట్లే.చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను నిర్ధారించడానికి వివిధ ఎలక్ట్రానిక్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌లతో కూడిన నావిగేషన్ సెన్సార్లు, ప్రొపల్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా రోవర్‌ను సురక్షితంగా దించడానికి టూ-వే కమ్యూనికేషన్-సంబంధిత యాంటెనాలు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్ యంత్రాంగాలు ఉన్నాయి. చంద్రయాన్ ప్రధాన లక్షాలు మొదటగా సురక్షిత ల్యాండింగ్ చేయడం, చంద్రుడిపై రోవర్‌ను దించడం, ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు చేయడమే. చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. 2021లో ప్రయోగించాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా మిషన్ కొంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. 2019లో చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్ విఫలమడంతో శాష్త్రవేత్తలు చంద్రయాన-3కి శ్రీకారం చుట్టారు.చంద్రయాన్-1 మిషన్ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది.  ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్ కోల్పోవడంతో మిషన్ ముగిసింది. తాజాగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ గత వారం చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండింగ్ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్