సీట్లు పోయిన అభ్యర్థులు వీరే

- Advertisement -

హైదరాబాద్, ఆగస్టు 21:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ షాక్‌ ఇచ్చారు.  ఏడుచోట్ల అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. వేములవాడ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, ఉప్పల్‌, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, కామారెడ్డి,  సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే

ఉప్పల్‌ – సుభాష్‌ రెడ్డి

బోథ్‌ –  రాథోడ్‌ బాపూరావు

ఖానాపూర్‌ – రేఖా నాయక్‌

అసిఫాబాద్ – ఆత్రం సక్కు

వైరా – రాములు నాయక్‌

వేములవాడ – చెన్నమనేని రమేష్‌

కామారెడ్డి – గంప గోవర్ధన్‌

హోల్డ్ లో పెట్టిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే

స్టేషన్‌ ఘన్‌పూర్‌ – రాజయ్య

సిట్టింగ్ ల వారసులు వీరే

కోరుట్ల – విద్యాసాగర్ రావు కొడుకు సంజయ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్   –  దివంగత సాయన్న కూతురు లాస్య ఇక హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని వెల్లడించారు.ఇక కామారెడ్డి, గజ్వేల్‌ స్థానాల నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నారు. కంటోన్మెంట్‌ నుంచి సాయన్న కుమార్తె పోటీ చేయనున్నారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం 114 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular