Wednesday, January 15, 2025

జాబిల్లిపై చంద్రయాన్-3

- Advertisement -

రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రార్థనలు జరిగాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని పాటలు పాడారు. అలాగే ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం కోసం వారంతా ఎదురుచూసారు.  ప్రముఖ సైకత శిల్పి సదర్శన్ పట్నాయక్ తన కళతో చంద్రయాన్-3 విజయాన్ని ఆకాంక్షించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయం సాధించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ల్యాండర్ ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్ బయటకు వస్తుంది. ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగించనున్నాయి.41రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లికి చేరువైంది చంద్రయాన్-3. సుమారు 4లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై  ల్యాండ్ అయింది. ల్యాండర్ విక్రమ్. బుధవారం సాయంత్రం 5:45కి ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది.  జర్నీ సక్సెస్ అవ్వడంతో.. భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. జాబిల్లి దక్షిణ ధృవంపై దిగింది చంద్రయాన్-3 ల్యాండర్. అత్యంత భారీ మంచు నిల్వలు ఉన్నట్టు భావిస్తోన్న దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్కి ప్రయత్నించింది. చంద్రుని ఉపరితలంపై దిగే టైమ్లో రెండు ఇంజిన్లను ఆన్ చేసారు. చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా జులై 14న నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3. శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన చంద్రయాన్-3… వివిధ దశలను దాటుకొని చంద్రునికి దగ్గరైంది. అంతా అనుకున్నట్టు చంద్రునిపై అడుగుపెట్టింది. ఆ వెంటనే.. ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సార్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ప్రపంచ దేశాల చూపులన్నీ చంద్రయాన్-3పైనే!. జాబిల్లిపై చంద్రయాన్-3ని భారత్ సాఫ్ట్ ల్యాండ్ చేయగలుతుందా లేదా అని వెయ్యి కళ్లతో చూస్తున్నాయ్! చంద్రయాన్ 3 ల్యాండింగ్కు సంబంధించి ఓ కీలక ట్వీట్ చేసింది ఇస్రో. అంతా అనుకూలంగా ఉందని.. ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ల్యాండర్ ప్రతి కార్యాచరణను తాము గమనిస్తున్నామని తెలిపింది. చంద్రుని దగ్గర 10 మీటర్లకు చేరుకున్న వెంటనే చంద్రయాన్ వేగం సెకనుకు 1.68 మీటర్లుగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో వేగాన్ని కొలవడానికి వాహనంలో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ను అమర్చారు. సాఫ్ట్ ల్యాండింగ్ను విజయవంతం చేసేందుకు.. ఇస్రో చంద్రయాన్ ల్యాండింగ్ అల్గారిథమ్ను మార్చింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్ తెలిపారు. ప్రధాని మోదీ కృషి వల్లే చంద్రయాన్-3 గమ్యాన్ని చేరుతోందని అన్నారు. చంద్రయాన్ సక్సెస్ అవుతుందంటూ పేర్కొన్నారు. 54ఏళ్ల ప్రస్థానంలో అనేక సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటైతే, కేవలం ఆరేళ్లలోనే తొలి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపి సంచలనం సృష్టించింది. 1975లో ఆర్యభట్టను నింగిలోకి పంపి విజయం సాధించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి సక్సెస్ కొట్టింది ఇస్రో.చంద్రునిపై ఇంతవరకూ మూడు దేశాలే సాఫ్ట్ల్యాండింగ్ చేశాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే మూన్ మిషన్లో సఫలం అయ్యాయి. ఇప్పుడు విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ తో  నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

ఇస్రో సైంటిస్టుల కుటుంబాల్లో సంబరాలు..

జాబిల్లి మీద చంద్రయాన్ అడుగుపెట్టిన వేళ ఈ మిషన్లో భాగస్వాములైన సైంటిస్టుల కుటుంబాలు సంబరాల్లో మునిగితేలుతున్నాయి

chandrayaan-3-on-zabili
chandrayaan-3-on-zabili
chandrayaan-3-on-zabili
chandrayaan-3-on-zabili
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్