Friday, December 27, 2024

ఉరుకుంద లో శ్రీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల సందడి

- Advertisement -

బారులు తీరిన వాహనాలు

కౌతాళం  ఉదయం న్యూస్ :  ఉరుకుంద లో వెలసిన (ఊరుకుంద) ప్రముఖ పుణ్య క్షేత్రము శ్రీ శ్రీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం రెండవ శ్రావణ మాస  సోమ వారం విశేష దినోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కోరిన వారికి కోరికలు నెరవేర్చే కొంగు బంగారం   ఈరన్న స్వామి. భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షం  స్వామి వారి విశేష దినోత్సవన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్ ను పూలు  వెండి ఆభరణాలు తో  అలంకరించారు. ఉదయం ఏడు గంటల సుప్రభాత సేవ  నుంచి రాత్రి ఏడు గంటల వరకు మంగళ హారతి నిర్యహించరు.  ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందిన భక్తుల సమక్షంలో ఎనిమిది  నుంచి పది వరకు  అవినేటి మండపంలో  స్వామి వారికి పంచామృత అభిషేకలు  సాయంత్రం ఆరు నుంచి  ఏడూ వరకు ధ్వజ స్థంభం వద్ద ప్రకరోత్సవాలు నిర్వహించారు.  మధ్యాహ్నం  స్వామి వారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు.  స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శననికి వచ్చిన భక్తలకు అన్ని రకాల వసతులు ఆలయ అధికారులు కల్పించారు.దర్శన భాగ్యం ఉదయం 7  నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉండటం వల్ల అధిక సంఖ్యలో భక్తులు దర్శన భాగ్యం చేసుకున్నారు. భక్తులు దేవుని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు  భక్తులకు అన్ని వసతులు కల్పించరు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది పగడ్బందీగా విధి నిర్వహణలు నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్