NSF ఆధ్వర్యంలో డీసీపీ చేతుల మీదుగా రోడ్డు సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కి సంబంధించిన పోస్టర్ విడుదల.
విద్యార్థులు, యువత డ్రగ్స్ కి దూరంగా ఉంటూ రోడ్డు భద్రత నియమాలు పట్టిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకున్నా మంచిర్యాల డీసీపీ . నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF) రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో డీసీపీ చేతుల మీదుగా NSF రోడ్డు సేఫ్టీ మరియు యాంటీడ్రగ్స్ కి సంబంధించిన పోస్టర్లను డీసీపీ విడుదల చేశారు, ఈ సంధర్భంగా డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల కోసం కష్టపడాలని అన్నారు, కొద్దీ సేపు మత్తు కోసం చూస్తే జీవితమే చేజారిపొయ్యే ప్రమాదం ఉందన్నారు,అంతే కాకుండా ఎవ్వరైనా మత్తు పదార్థాలు తీసుకుంటూ పట్టుబడితే కోర్టులు,కేసులు లు అంటూ తిరగాల్సిన పరిస్థితులు కూడా రావొచ్చని హెచ్చరించారు.

అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఏదో ఎంజాయ్ కోసం అని ఇష్టంవచ్చినట్టు రైడ్ లు చేయడం ఈ మధ్య సరదా అయ్యిందని అలా చేస్తూ లైసెన్సు లేకుండా లేదా రోడ్డు భద్రత నియమాలు పట్టించకుండా ఇష్టం వచ్చినట్టు రైడ్ లు చేయడం చాలా ప్రమాదం అన్నారు,మీరు పోలీసు లకు దొరకకుండా తప్పించుకోవచ్చేమో కానీ, ఒక్కవేల అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే మీ కుటుంభానికే దొరుకాకుండా పొయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పట్టించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో NSF రాష్ట్ర నాయకులు నీరటి రాకేష్, సాయి కుమార్, సతీష్,మధు,వినయ్ తదితరులు పాల్గొన్నారు.



