- Advertisement -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు
లక్నో: ఉత్తర ప్రదేశ్ బారబంకిలో ఘోర ప్రమాదం చోటు చేసకుంది. మూడంతస్థుల భవనం ఒకటి కుప్పకూలి.. ఇద్దరు మృతి చెందారు. చికిత్సలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడం, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉన్నట్లుండి.. భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పన్నెండు మందిని శిథిలా నుంచి బయటకు తీశారు. వీళ్లలో ఇద్దరు ఆస్పత్రికి తరలించాక మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది..
- Advertisement -