Sunday, January 25, 2026

ఢిల్లీలో ఐదు రోజులు మద్యం దుకాణాలు మూత

- Advertisement -

శ్రీ కృష్ణ జన్మాష్ఠమి సందర్భంగా రెండు రోజులు, జీ 20 దేశాధినేతల సదస్సు సందర్భంగా మరో 3 రోజులు లిక్కర్ దుకాణాలు మూసి వేసి ఉంటాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మద్యం ప్రియులు.. లిక్కర్ షాప్‌లకు క్యూ కట్టారు. ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి ఉండనున్న నేపథ్యంలో తమకు ఇష్టమైన, అవసరమైనంత మందును ముందుగానే కొని దాచి పెట్టుకుంటున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా వైన్ షాపుల ముందు భారీగా జనం లైన్లలో నిలుచుంటున్నారు.

Liquor shops remain closed in Delhi for five days
Liquor shops remain closed in Delhi for five days

అయితే ఇది మన దగ్గర కాదు దేశ రాజధాని ఢిల్లీలో. శ్రీ కృష్ణ జన్మాష్టమి, జీ 20 సదస్సు వరుసగా రావడంతో వైన్ షాపులను మూసివేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 6, 7 వ తేదీల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉండగా.. 8, 9, 10 వ తేదీల్లో ఇప్పటికే దేశ రాజధాని పరిధిలో ప్రభుత్వం మొత్తం బంద్ ప్రకటించింది. ఢిల్లీలో సెప్టెంబర్‌ 9, 10 వ తేదీల్లో జీ 20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 8 నుంచి 10 వ తేదీ వరకు ఇప్పటికే పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది. ఈనెల 8, 9, 10 వ తేదీల్లో మూడు రోజుల పాటు ఢిల్లీలోని మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు 3 రోజులు బంద్ విధించగా.. ఇక అంతకుముందు రెండు రోజులను ఢిల్లీ ప్రభుత్వం బంద్‌ ప్రకటించింది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నెల 6, 7 వ తేదీల్లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని సీఎం కేజ్రీవాల్‌ సర్కార్ ఆదేశించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఐదు రోజులపాటు వైన్‌ షాపులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాలకు వరుస సెలవులు ఉండటంతో ఢిల్లీ వాసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దీంతో లిక్కర్ షాప్‌ల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల గంటల తరబడి క్యూలో ఉండి మరీ మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నట్లు మద్యం దుకాణ యజమానులు పేర్కొంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్