ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
మంత్రి మహేందర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు,భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, గనులు,భూగర్భ వనరుల శాఖ పై ఉన్నతాధికారులతో శుక్రవారం డా.బి.ఆర్. ఆంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలను మంత్రికి వివరించారు.
మంత్రి మాట్లాడుతూ గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయం. రాష్ట్ర ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని అధికారులకు సూచించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 అధికారులు, సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయమన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి ఈ విషయాన్ని తెలియపరుస్తాం. సాంకేతికను అనుసంధానం చేసి గనులు,భూగర్భ వనరుల శాఖను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్లైన్ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. టీఎస్ఎండిసి సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. గత ఏడేళ్ల కాలంలో రూ.5,444 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చిందని తెలిపారు.
రాష్ట్రంలో 101 ఇసుక రీచ్ ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ నివారణను అడ్డుకట్ట వేస్తున్నం. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తదితరాల కు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు వ్రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ దేవెందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.