జనసేన పేరు చంద్రసేనగా మార్చాలి : మంత్రి రోజా

- Advertisement -

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు సబబేనని మంత్రి రోజా అన్నారు. ఈ కేసు ఆరంభం మాత్రమేనని ఇంకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. త్వరలో లోకేశ్, అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తారన్నారు. జనసేన పేరు చంద్రసేనగా మార్చాలని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్ సూత్రధారి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసం ఉపయోగించారని విమర్శించారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌ విధించిందన్నారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రోజా విమర్శలు చేశారు. బోగస్‌ కంపెనీలతో దోచుకున్న కరప్షన్‌ కింగ్‌ అన్నారు. చంద్రబాబుపై కక్షసాధించే అవసరం వైసీపీ లేదన్నారు. సీఎం జగన్‌ పార్టీ పెట్టింది ప్రజల కోసమన్నారు. జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్ చంద్రసేనగా మార్చేశారని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తికి మద్దతిస్తున్నారని పవన్ పై మండిపడ్డారు. పవన్‌ టీడీపీ బంద్ కు ఎందుకు మద్దతిచ్చారని ఆమె ప్రశ్నించారు. పవన్‌ ప్యాకేజ్‌ స్టార్‌ అని మరోసారి రుజువైందని మంత్రి రోజా విమర్శలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular