ఆరు గ్యారెంటీ కార్డు పథకాలతో అధికారంలోకి కాంగ్రెస్

- Advertisement -
Congress came to power with six guarantee card schemes
Congress came to power with six guarantee card schemes

తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో కేవలం కేసీఆర్ కుటుంబం పాలిస్తుందని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె ఎస్ అలగిరి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందని అది కూడా అప్రజాసామిక ఉందని కెసిఆర్ కుటుంబ అవినీతి పాలనతో ప్రజలంతా విసుగెత్తి ఉన్నారని అధికారులు కూడా విస్మయంతో ఉన్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు.సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో లక్షలాదిమంది కాంగ్రెస్,ప్రజల మధ్యన  విజయభేరి సభలో తెలంగాణ 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి కార్యకర్త రోజుకు పదిమంది సామాన్య ప్రజలను కలిసి గ్యారంటీ పథకాలను వివరించి వారి చేత గ్యారెంటీ కార్డ్  లను తీసుకునేలా చేయాలని తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీ కార్డు పథకాలే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు వస్తాయని ఇలాంటి గొప్ప పథకాలు గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా లేవని చెప్పారు. ప్రజలకు గ్యారెంటీ పథకాలను వివరించడం మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించారు.

Congress came to power with six guarantee card schemes
Congress came to power with six guarantee card schemes
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular